కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా మంగళవారం ఈవీఎం గోడౌన్ ను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా ఈవీఎం,వీవీ ప్యాట్లు ఉన్న గదిని,సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు.