Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: రాజుర గ్రామ సమీపంలోని కల్వర్టుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వర్షపు నీరు, దాటేందుకు ఇబ్బంది పడిన వికలాంగుడు

Asifabad, Komaram Bheem Asifabad | Aug 27, 2025
ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామ సమీపంలోని కల్వర్టుపై బుధవారం కురిసిన వర్షానికి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహించింది. వినాయక చవితి సందర్భంగా జిల్లా కేంద్రానికి వెళ్ళిన ఓ వికలాంగుడు కల్వర్టు దాటడానికి ఇబ్బందులు పడ్డాడు దీంతో గ్రామానికి చెందిన యువకులు అతన్ని ఎత్తుకొని కల్వర్టు దాటించారు. కాగ ఈ కల్వర్టును ఈనెల 20వ తేదీన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కల్వర్టు పైనుండి నీరు వెళ్లకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఎలాంటి అంతరం లేకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us