పెద చెర్లోపల్లి: రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీల నిర్వాహకులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని పెదచెర్లోపల్లి ఎస్సై కోటయ్య సూచించారు. పెదచెర్లోపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్సై మాట్లాడుతూ.... గ్రామాల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకునే ఉత్సవ కమిటీల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మద్యం తాగి మండపాల వద్ద ఎటువంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.