పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి వల్లనే మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు హాల్టింగ్ వచ్చిందని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు అన్నారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎంపీ వంశీ కృష్ణ చిత్రపటానికి నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వందే భారత్ హాల్టింగ్ తో మంచిర్యాల జిల్లా ప్రజలకు హైదరాబాద్ ప్రాంతానికి ప్రయాణం సులభతరం కానుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పక్కగా ఎంపీ వంశీకృష్ణ నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు.