అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఎలగలవంక గ్రామానికి చెందిన కురుబ పోతన్న(71) అప్పుల బాధ తాళలేక విషపు గులికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బెళుగుప్ప మండలం ఎస్సై శివ శనివారం సాయంత్రం పేర్కొన్నారు. రైతు తనకున్న ఏడు ఎకరాల్లో బోరు బావులను వేసి పంటల సాగుకు అప్పులు చేసి సరైన దిగుబడి లేక అప్పులు కాస్తా పెరిగి 25 లక్షల వరకు అప్పులు చేశారన్నారు. అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్థాపానికి గురై విషపు గుళికలు మ్రింగి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాదన్నారు. ఘటనపై మృతుని భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ పేర్కొన్నారు.