విజయనగరం జిల్లాలో ఓ మహిళ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కారు. శృంగవరపుకోట నియోజకవర్గం లోని వేపాడ మండలం సింగరాయి గ్రామంలో వీఆర్వో గా పని చేస్తున్న సత్యవతి గురువారం సాయంత్రం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ప్రాథమిక సమాచారం మేరకు ఓ రైతు వద్ద నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం తహసిల్దార్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ రైడ్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.