అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 8:30 గంటలకు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో రాము, సునీల్, భాను అనే ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ఘటన సమయంలో గ్రామానికి సమీపంలోనే ఎస్ఐ శివ ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితి విషమంగా ఉన్న రామును పోలీస్ జీపులోనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి ఎస్సై తరలించారు.