ప్రజా కవి, పద్మవిభూషన్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రాంతానికి చేసిన సేవలు కొనియాడారు.. కాళోజీ తెలుగు, ఉర్దూ హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు కాళోజీ నారాయ