విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ అన్నారు. సోమవారం తాంసి మండలంలోని ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు.