ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు దేవునిపల్లిలో గురువారం డాక్టర్ శరత్ కుమార్ ఆధ్వర్యంలో మత్తమాల ఆరోగ్య కేంద్రం వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. గ్రామ ప్రజల్లో వ్యాప్తి చెందుతున్న జ్వరాలు, వైరల్ ఫీవర్ సమస్యలను గుర్తించి, నివారణ చర్యల కోసం ఈ శిబిరం నిర్వహించారు. ఏఎన్ఎం లలిత, ఆశా వర్కర్ విజయలక్ష్మి వైరల్ ఫీవర్ పరీక్షలు నిర్వహించి, రోగులకు అవసరమైన మందులు, గోలీలు ఉచితంగా అందజేశారు. ప్రతి ఒక్కరూ నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవాలని, పరిసరాల ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.