గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కాజిపల్లి జర్నలిస్ట్ కాలనీ గణేష్ లడ్డు 83 వేల రూపాయలకు స్థానిక యువజన నేత కుమార్ యాదవ్ వేలంపాటలో దక్కించుకున్నారు. సోమవారం జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిమజ్జన శోభాయాత్రలో లడ్డును కుమార్ యాదవ్ మరోసారి దక్కించుకున్నారు. గతేడాది కూడా ఆయనే లడ్డు దక్కించుకున్నారు. జర్నలిస్టు ప్రతినిధులు ఆయనకు లడ్డు అందజేసి ఘనంగా సన్మానించారు.