గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన వేణు మిత్ర ఫర్టిలైజర్స్ యజమాని గొట్టం పరమేశ్వరరావు 2 కోట్ల మేర రైతులకు అప్పులు ఇచ్చి రైతుల నుండి డబ్బులు రాక షాపు ముందే బుధవారం యజమాని నిరాహార దీక్ష చేపట్టారు. కంపెనీలు వాళ్ళు నాకు అప్పులు ఇచ్చిన వాళ్లు నన్ను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఏం చేయాలో తెలియక నాకు నేనుగా ఈ శిక్ష విధించుకున్నాను. ఇప్పుడైనా రైతులు స్పందించి నాకు రావలసిన బాకీలను ఇస్తారని ఆశిస్తూ ఎదురుచూస్తున్న ఎరువుల షాపు యజమాని తెలిపారు. రైతులను నమ్మి అప్పు ఇచ్చిన ఫర్టిలైజర్స్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.