అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఉన్న అండర్ డ్రైనేజీ వ్యవస్థ అద్వాన్నంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడానికి గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికులతో గురువారం సాయంత్రం టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున పంచాయతీ సిబ్బందితో డ్రైనేజీ వ్యవస్థను స్వయంగా పరిశీలించారు. మురుగునీరు స్తంభించిపోయిన అండర్ డ్రైనేజీ పైపుల్లో కుళ్లిపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికుల చేత తొలగింప చేస్తూ వ్యవస్థను పునరుద్ధరింప చేసే విధంగా పనులను చేపట్టారు. కాలనీవాసులు అండర్ డ్రైనేజీ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.