వర్షా కాలం నేపథ్యంలో చేబ్రోలు పీహెచ్సీ పరిధిలో అక్కడక్కడ జ్వరాలు ఉన్నాయని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పీహెచ్సీ వైద్యురాలు డా.ఊర్మిళ తెలిపారు. చేబ్రోలులో శనివారం ఆమె మాట్లాడారు. కొత్త రెడ్డిపాలెంలో జ్వరాల బాధితులకు పరీక్షలు నిర్వహించామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారిలో మెలియాయిడోసిస్ రోగ లక్షణాలు లేవన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.