కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత నడుమ సోమవారం టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఫ్లెక్సీని బిజెపి నాయకులు దగ్ధం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మహేష్ కుమార్ గౌడ్ అనుచిత వాక్యాలు చేశాడని దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పక్కనే ఉన్న మహేష్ కుమార్ ఫ్లెక్సీ ని దగ్ధం చేశారు. అనంతరం మరో దిష్టిబొమ్మ తీసుకొచ్చి దగ్ధం చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ పై అనుచిత వాక్యాలు చేసిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.