పలమనేరు: మండలం పోలీసు వర్గాలు బుధవారం తెలిపిన సమాచారం మేరకు. సీఐ నరసింహారాజును విఆర్ కు రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నపలంగా ఎందువల్ల విఆర్ కు రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలిచ్చారో వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన స్థానంలో గంగవరం మండలం లో పనిచేస్తున్నటువంటి మురళీమోహన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.