ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రేగులగడ్డ గ్రామంలో భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఐ సోమశేఖర్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ నరసింహ పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. భార్యను రోకలి బండతో నరసింహ దాడి చేసి తర్వాత అతని గొంతు కోసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.