శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న లగేజీ బ్యాగును పరిశీలించారు. ఆ బ్యాగ్ లో ఒడిస్సా నుంచి ఉత్తరప్రదేశ్ కు తరలించేందుకు 2.70 కిలోల గంజాయి తో పాటు ఆయన వద్ద ఓ సెల్ఫోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామన్నారు. నిందితుడు ను కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ప్రభుత్వ నిషేధిత పదార్థాలు ఏవైనా రవాణా చేసిన నిల్వ ఉంచిన చట్ట పరంగా చర్యలు తప్పవని CI చిన్నమ్మ నాయుడు తెలిపారు..