ప్రజా సమస్యలను పాలకులు పరిష్కరించాలని, యూరియా కొరతను నివారించాలని, తక్షణమే రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు హెచ్చరించారు. సోమవారం మోతే మండల వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు.