వివిధ సమస్యలతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వైద్యులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం శేఖరం బంజర గ్రామంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పర్యవేక్షించి, రోగుల రికార్డులు, రిజిస్టర్లు, ఔషధ నిల్వలు, వ్యాక్సిన్ భద్రత, ల్యాబ్ సదుపాయాలను నిశితంగా పరిశీలించారు.