ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయలపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లలతో బైక్ పై వెళ్లి తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసినదే. ముగ్గురు పిల్లలలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో భర్త మృతి తో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. మృతుని ఇంట్లో భార్య బంధువుల రోదనలు అక్కడ ఉన్న వారిని కలిచి వేశాయి. నాకెందుకు దేవుడా ఈ బ్రతుకు భర్త పిల్లలు లేకుండా నేను ఉండలేను అంటూ భార్య కన్నీరై మున్నీరై రోదిస్తుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.