తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు, గ్యారంటీ కార్డులు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతు భరోసా సక్రమంగా అమలు చేస్తుందనీ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. యూరియా కొరత అనేది కేంద్ర ప్రభుత్వ సమస్య అని, కేంద్రం యూరియా సరిగ్గా సరఫరా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. కేంద్రం నుంచి రావలసిన యూరియా రాలేదని అడగ్గా యుక్రెయిన్ నుంచి సరఫరా తగ్గిందని ప్రధాని మోదీ చెప్పడం చాలా విడ్డురంగా ఉందని పేర్కొన్నారు.