సంగారెడ్డి కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 4334 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా భవాని చంద్ర మాట్లాడుతూ రాజీ చేయిదగ్గ పోలీస్ కేసులు భార్యాభర్తల చిన్నచిన్న వివాదాలు ఎక్సైజ్ కేసులు బ్యాంకు కేసులు తదితర కేసులు రాజీ చేయడం జరిగిందని తద్వారా సమయం డబ్బు వృధా కాదని అన్నారు. క్రిమినల్ కాంపౌండ్ 3,850, సివిల్ 22, మోటార్ వాహనాలది 21, ఫ్రీ లిటిగేషన్ 40, బ్యాంకు రికవరీ 58, సైబర్ క్రైమ్ 93, విద్యుత్ సౌర్యం 238 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.