అనంతపురం జిల్లా విడపనకల్లు మండల పరిధిలోని హావలిగి గ్రామానికి చెందిన రైతు లేపాక్షి (39) అప్పుల బాధ తాల లేక ఇంట్లోనే విషపు గులికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది భూములను కౌలుకు తీసుకొని మిర్చి పంటను సాగు చేయడంతో సుమారు పది లక్షల పైగా అప్పులు మిగలడం జరిగిందని దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతు ఇంట్లోనే విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్నారు. మృతునికి భార్య వరలక్ష్మి కూతుర్లు పల్లవి సౌజన్య భావని శశి ఉన్నారు.