జిల్లాలో అంగన్‌వాడి కేంద్రాలు, గ్రామ పంచాయతి భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ,పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, మహిళా సంక్షేమ, డిపిఓ, డిఆర్డీఓ, టీడబ్ల్యూ ఐడిసిలతో అంగన్ వాడి, గ్రామ పంచాయతి భవనాల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భవనాల నిర్మాణం లోపాలు లేకుండా నాణ్యతతోపాటు వేగం కూడా పెంచాలని సూచించారు. పనుల పురోగతి వివరాలను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.