ప్రజల గోడును తన రచనల ద్వారా వినిపించిన అక్షర యోధుడు కాళోజీ అని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ యాసలో కవిత రాసిన మొట్టమొదటి కవి కాళోజీ అన్నారు. సాహితీ ప్రపంచంలో నిజమైన ప్రజాకవి ఆయన అన్నారు.