గాంధారి : గణేష్ విగ్రహాల నిర్వహకులకు మరియు డీజే సౌండ్స్ పెట్టే వాళ్లకు సూచనలు చేసిన ఎస్ఐ ఆంజనేయులు. మీరు ఎట్టి పరిస్థితులలో డీజే సౌండ్స్ లో గ్రామాలలో గాని, రోడ్లపై గాని వినాయక నిమజ్జనంలో గాని వాడినట్లయితే గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడును. దీనిపై చట్టరీత్యా చర్య తీసుకోని కేసులు నమోదు చేయబడును. DJ లు పెట్టే వాహనాలు మరియు డీజే ల ను సీజ్ చేయబడును. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ విషయంలో మేము ఉపేక్షించేది లేదు. ఇది అందరి పండుగ ఆనందంగా జరుపుకుందాం బ్యాండ్ మేలాలతో కోలాటాలతో భజనలతో శాంతిపూర్వకంగా నిర్వహించుకుందాం అన్నారు.