పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై బురద జల్లడానికి వైసీపీ నేత అంబటి మురళీ ప్రయత్నిస్తున్నారని పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఆరోపించారు. పెదకాకాని ఎంపీపీ కుటుంబ సభ్యులు బోర్లు వేయించడంలో అవినీతికి పాల్పడిన మాట వాస్తవమేనని వారు తెలిపారు. వైసీపీ యాదవులకు ఎప్పుడూ మేలు చేయలేదని వారు విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.