Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ముసునూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పదేళ్లుగా ఎమ్మెల్యేగా దోచుకున్న ప్రతాపరెడ్డి, తనను హతమార్చి కావలిని దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజలు అణిచివేసినా సిగ్గు రాలేదా అని ప్రశ్నించారు. 16 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డి పతివ్రతలా వచ్చి తమను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు.