ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ప్రముఖ వైద్యులు సేవా కుమార్ సూచించారు. ప్రార్థనా మందిరాలలో మైకులు 55 డెసిబెల్కు మించకుండా చూడాలని అన్నారు. కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాలను వాడాలని వారు ప్రజలకు సూచించారు. రామన్నపేటలో సోమవారం జరిగిన జనచైతన్య వేదిక సదస్సులో ఈ అంశాలపై చర్చించారు.