వరుసగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వికారాబాద్ పట్టణంలో గల శివసాగర్ ప్రాజెక్టు నిండికుండలా మారి కళకళలాడుతుంది. వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న పట్టణానికి త్రాగునీరు అందించే శివసాగర్ చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోవడంతో పట్టణ ప్రజలు తిలకించి ఆనంద పరవశంతో అవుతున్నారు. భారీ వర్షాలు కురుస్తునంతో అలుగు పారెందుకు శివసాగర్ చెరువు పూర్తిగా నిండిపోయి సిద్ధంగా ఉంది.