లారీ డ్రైవర్ల పై దాడి చేసిన ముగ్గురు యువకులను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఉపేందర్ గురువారం మధ్యాహ్నం 2:00 లకు తెలిపారు..తొర్రూరు పట్టణంలోని దుబ్బ తండా సమీపంలో మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్, రాజమండ్రికి చెందిన లారీ డ్రైవర్లపై ముగ్గురు యువకులు దాడి చేశారన్నారు. రాజమండ్రికి చెందిన పెద్దపాటి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించిందని,దీంతో వారిని మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించామని ఎస్సై పేర్కొన్నారు..