అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ విధానమని,ఏ ఒక్కరికి అన్యాయం జరగదన్న భరోసాను జిల్లా కలెక్టర్లు ప్రజలకు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు.సచివాలయం నుండి గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వెరిఫికేషన్ దశలో ఉన్న పెన్షన్ అప్పీల్ దారులకు కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ ఇస్తారనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.అలాగే యూరియాకు కొరత లేకుండా చూడాలని కూడా ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు. ప్రకాశం జెసి గోపాలకృష్ణ పాల్గొన్నారు