కరీంనగర్ ప్రగతినగర్ లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. శనివారం సాయంత్రం 5గంటలకు ప్రగతినగర్ రోడ్ నంబర్ 3లో చక్రధర్ రాజు సరళ దంపతులు నివాసముంటున్నారు. ఎనిమిది నెలల కిందట ఇంటికి తాళం వేసి అమెరికాలోని తమ పెద్ద కుమారుని వద్దకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం చుట్టుపక్కల వారు గమనించి యజమానులకు సమాచారం అందించారు. ఇంటి వెనుక వైపున్న వంట గది తలుపు తెరచి ఉండడాన్ని గమనించారు. దాదాపు 5 తులాల బంగారంతోపాటు సామాగ్రితోపాటు పట్టుచీరలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. రెండో ఠాణా పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.