కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం 6గంటలకు పాతబజార్ లోని హనూమాన్ ఆలయం వద్దగల గణేష్ మండపం వద్దగల మొదటి గణపతికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్సంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. ప్రశాంత వాతావారణంలో నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. నగరంలో ప్రతిఏటా వినాయక మండపాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.