ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సిరికొండ మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ సూర్యవంశి రాజేశ్వర్ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ, బోత్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ వారి స్వగృహానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకుని సానుభూతి ప్రకటించారు.ఆర్మీ జవాన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.