కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సోమవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. అటెండెన్స్, ఓ పి రిజిస్టర్ వెరిఫై చేశారు. డాక్టర్ మరియు సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలి. సీజనల్ వ్యాధులకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు, మరియు మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. పి ఎచ్ సి లోపల మరియు పరిసరాలు శుబ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. రోగులతో మాట్లాడుతూ... వర్షాకాలం కావున అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఇంటి చుట్టూ నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని, కాచి చాలార్చిన నీటినే తాగాలని, ఆహారం వేడిగా ఉన్నపుడే తినాలని స