భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పలు వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని బిజెపి పార్టీ పేదలకు నిత్యం అండగా ఉంటుందని మరోసారి ఆయన నిరూపించారని వారు అన్నారు.