నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు 6వ టౌన్ ఎస్ఐ వెంకట్రావు శుక్రవారం తెలిపారు. అర్సపల్లి ప్రాంతంలోని NN ఫంక్షన్ హాల్ సమీపంలో అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు వయసు 50-55 సంవత్సరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఎవరైనా గుర్తుపడితే ఆరవటంలో సంప్రదించాలన్నారు.