మద్యం సేవించి డయల్ 100 నంబర్కు పదేపదే కాల్స్ చేసి, పోలీసు సిబ్బందికి, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు బాల్కొండ కేసీఆర్ కాలనీకి చెందిన మొహమ్మద్ షౌకాత్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి, ఆర్మూర్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. నిందితునికి 3 రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు.