మడకశిర ఎస్సీ కాలనీకి చెందిన జయమ్మ అనారోగ్య సమస్యలతో బుధవారం అనంతపురం ఆస్పత్రిలో మృతి చెందింది. జయమ్మ మృతదేహాన్ని మడకశిరకు తీసుకెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కార్యాలయాన్ని జయమ్మ కుటుంబ సభ్యులు ఆశ్రయించారు.ఎమ్మెస్ రాజు తక్షణమే స్పందించి అంబులెన్స్ ను ఏర్పాటు చేసి జయం మృతదేహాన్ని మడకశిరకు పంపించారు.