సంగారెడ్డి జిల్లాలోని అన్ని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు వెళ్లలేని గిరిజన తండాలను గుర్తించాలని పేర్కొన్నారు. పీడబ్ల్యూడీ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆఫీసర్లు పాల్గొన్నారు.