వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని సోమవారం మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాతం పలికారు. స్వామివారికి మొక్కలు చెల్లించుకుని సేవలో తరించారు. స్వామి వారి దర్శనం తర్వాత అర్చకులు ఆశీర్వదించగా ఈవో రాధా బాయి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని మంత్రి హోదాల మొదటిసారిగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరిపై స్వామివారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.