కరీంనగర్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వెండింగ్ జోన్స్ ఆక్టివిటీ జరిగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ట్రాఫిక్ ఏసిపి స్వామి బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో ఉన్నారు. రెడ్ జోన్, అంబర్ జోన్, గ్రీన్ జూన్ లలో వెండర్స్ ఆక్టివిటీ, ఫుట్ పాత్ రోడ్డు అక్రమణాలు, ట్రాఫిక్ సమస్యలు, వీధి వ్యాపారులకు జీవిత బీమా సౌకర్యం తదితరు అంశాలపై కమిటీ సభ్యులు అధికారులతో కమిషనర్ సుదీర్ఘంగా చర్చించారు. పలు సలహాలు సూచనలు చేస్తూ టౌన్ ప్లానింగ్,మెప్మా, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.