మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ ముదిరాజ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాచన్ పల్లి లోని ఒక యువతిని వెంకటేష్ ప్రేమించాడని తెలిసి మాచన్ పల్లి, గాజులపేట గ్రామాలకు చెందిన కొందరు యువకులు వెంకటేష్ ను చిత్ర హింసలకు గురిచేసి చెట్టుకు ఉరివేసి చంపారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతుడి శరీరం వెనుక భాగంలో తీవ్ర గాయాలు, వృషణాలు చిదిమేసి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు రిజిస్టర్ చేసినట్లు, శుక్రవారం పోస్టుమార్టం తర్వాత పూ