నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన కేతావత్ రాజు (36) భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు నాగిరెడ్డిపేట్ ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు కేతావత్ రాజు తాగుడుకు బానిసై, తాగి ఇంటికి రావడంతో భార్య లలిత నువ్వు తాగుడుకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని గొడవ పడ్డాడు. మనస్థాపం చెందిన రాజు ఇంటి నుండి ఈనెల 6న పారిపోయి. మరుసటి రోజు వెతికి ఇంటికి తెచ్చారు. అదే రోజు రాత్రి రాజు అందరు పడుకున్నాక రాత్రి లేచి పురుగుల మందు సేవించాడు. భార్య లలిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.