మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలు, రవాణాను అరికట్టడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని విసి హాలులో జిల్లాలో మత్తు పదార్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై.. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా స్థాయి యాక్షన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల మూల సరఫరా రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పటిష్టమైన నిఘా చర్యలు అవలంబించాలని తెలిపారు.