విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, శుభ్ర తతో కూడిన భోజనం అందించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వసతిగృహంలో ఆహార పదార్థాల నాణ్యత, వాటి గడువు తేదీ పరిశీలించడంతో పాటు స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు.విద్యా ర్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పె ట్టాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.