ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు 6వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే పెన్షన్ లు పెంచాలని, ఇతరులకు 4వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి పిలుపు మేరకు ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తక్షణమే పెన్షన్ లు పెంచాలని నినాదాలు చేశారు.