వేటపాలెం మండలంలోని రౌడీషీటర్లకు చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు,ఎస్సై జనార్ధన్ లు శనివారం వినూత్న రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. సాధారణ శైలికి భిన్నంగా రౌడీ షీటర్లను వేటపాలెం లో వందేళ్ళ చరిత్ర కలిగిన లైబ్రరీకి తీసుకువెళ్లి అహింసా వాది మహాత్మా గాంధీ అక్కడ వదిలి వెళ్ళిన వూత కర్రను చూపారు.రౌడీ షీటర్లు తమ జీవనశైలిని మార్చుకొని,తమ పిల్లలను ఇలాంటి లైబ్రరీకి పంపి ప్రయోజకులను చేయాలని సూచించారు.